అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తానంటున్న నిఖిల్ !

nikhil-i
ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమలోని హీరోలు సాధించిన విజయాల్లో యంగ్ హీరో నిఖిల్ సక్సెస్ ఫుల్ చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా ఒకటి. దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్లో రూపుదిద్దుకుని నవంబర్ 18న రిలీజైన ఈ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 30 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి నిఖిల్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్లు సాధిస్తున్న నిఖిల్ తరువాతి సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన నిఖిల్ ‘అందరూ ఎక్కడికి పోతావు చిన్నవాడా తరువాత నా సినిమా ఎలా ఉంటుందో చెప్పమని అడుగుతున్నారు. అందుకే ఈ వివరాలను ఈరోజు సాయంత్రం 6:30లకు చెప్పేస్తా. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది’ అంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టి అందరిలోనూ అటెంక్షన్ క్రియేట్ చేశాడు.