వేసవి పోటీకి సిద్దమవుతున్న నిఖిల్!


వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో నిఖిల్ తన తరువాతి చిత్రం ‘కేశవ’ తో వేసవి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ రెండవ వారంలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. ఏప్రిల్ 28న ‘బాహుబలి – ది కంక్లూజన్’ రిలీజవుతుండటంతో అన్ని సినిమాలు వెనక్కు తగ్గుతున్న సమయంలో ఏప్రిల్ రెండో వారంలోనే నిఖిల్ తన సినిమాను రిలీజ్ చేస్తుండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

నిఖిల్ స్టోరీ సెలక్షన్ మీద ప్రేక్షకులకున్న నమ్మకం, ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై పాజిటివ్ క్రేజ్ బాగా పెరిగింది. ఈ నమ్మకంతోనే కేశవ టీమ్ బాహుబలి వేడి తగ్గకముందే థియేటర్లలోకి వచ్చే సాహసం చేస్తోంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ రివెంజ్ డ్రామాలో రితు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు అవసరాల శ్రీనివాస్ ‘బాబు బాగా బిజీ’ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలను నిర్మించింది అభిషేక్ పిక్చర్స్ సంస్థే కావడం విశేషం.