రీమేక్ సినిమాను మొదలుపెట్టిన నిఖిల్ !


ఇటీవలే ‘కేశవ’ సినిమాతో పలకరించిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ ని తెలుగులోకి రీమేక్ చేసే పనిలో ఉన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ సినిమా కోసం నిఖిల్ వర్కవుట్స్ చేసి తన లుక్ ను కూడా మార్చుకున్నారు.

నిఖిల్ కు మంచి మిత్రులైన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తుండగా సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్లో నటించిన సంయుక్తా హెగ్డే ఇందులో ఒక హీరోయిన్ కాగా మరొక హీరోయిన్ కోసం వెతుకులాట జరుగుతోంది. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందివ్వనున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.