సమ్మర్ కి రెడీ అవుతున్న నిఖిల్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’

Published on Jan 30, 2023 5:00 pm IST

కార్తికేయ 2 మూవీ భారీ సక్సెస్ తో నేషనల్ వైడ్ గా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ. ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ తో కలిసి నిఖిల్ చేసిన మూవీ 18 పేజెస్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లవ్, రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొంది ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ స్పై వేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. గతంలో అడివిశేష్ హీరోగా నటించిన ఎవరు, గూఢచారి, వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన బీహెచ్. గ్యారీ ఈ మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పడుతున్నారు.

ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా భారీ పాన్ ఇండియన్ మూవీగా భారీ స్థాయిలో రూపొందుతున్న స్పై మూవీ నుండి తన లుక్ ని కొద్దిసేపటి క్రితం హీరో నిఖిల్ స్వయంగా అఫీషియల్ లీక్ అంటూ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. స్పై గా నిఖిల్ గన్ పట్టుకుని ఉన్న ఈ లుక్ ప్రస్తుతం అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా అభినవ్ గోమఠం, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా, రవి వర్మ, నితిన్ మెహతా వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సమ్మర్ కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :