‘నిన్ను కోరి’ టీజర్ వచ్చేస్తోంది !


వరుస విజయాలతో హీరో నాని దూసుకుపోతున్నాడు.నాని ప్రస్తుతం నటిస్తున్న ‘నిన్ను కోరి’ చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నాని నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ మూవీ.కాగా ఈ చిత్ర టీజర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. టీజర్ ని జూన్ 9 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటని కూడా విడుదల చేసారు. నాని సరసన జెంటిల్ మన్ ఫేమ్ నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.జులై 7 న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.