తన 2 దశాబ్దాల ప్రయాణంపై నితిన్ ఎమోషనల్ మెసేజ్.!

Published on Jun 14, 2022 8:00 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. తన ఆల్ టైం అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లానే సినీ లైఫ్ లో చాలా ఏళ్ళు సరైన హిట్ లేకున్నా కూడా తన తరహా లోనే ఇప్పటికీ మంచి క్రేజ్ తో తన సినిమాలకి సాలిడ్ మార్కెట్ ని నిలుపుకున్న హీరోగా ఇప్పటికీ నిలబడ్డాడు. అయితే గార ఎండీ దశాబ్దాల కితం తెలుగు సినిమా దగ్గర తన ప్రయాణం “జయం” సినిమాతో మొదలు పెట్టిన నితిన్ ఇప్పుడు తన ఈ 2 దశాబ్దాల ప్రయాణంపై ఎమోషనల్ మెసేజ్ ని పంచుకున్నాడు.

“20 ఏళ్ల కితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు, మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకి పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ ఇలా నేను పని చేసిన సినిమాకి ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇన్నేళ్ళుగా నన్ను అభిమానిస్తూ నన్నే ఫాలో అవుతు చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకి అయితే ఎప్పటికీ హృదయపూర్వకంగా ఋణపడి ఉంటాను” అని నితిన్ తన 20 ఏళ్ల జర్నీ పై ఎమోషనల్ మెసేజ్ ని పంచుకున్నాడు.

సంబంధిత సమాచారం :