సరికొత్త మాస్ గెటప్ లో నితిన్…మాచర్ల నియోజకవర్గం మోషన్ పోస్టర్ రిలీజ్!

Published on Sep 10, 2021 8:00 pm IST


నితిన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఎమ్. ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. అంతేకాక ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం అంటూ టైటిల్ తోనే సినిమా పై హైప్ క్రియేట్ చేసారు అని చెప్పాలి.

తాజాగా విడుదల అయిన మోషన్ పోస్టర్ లో నితిన్ సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి మరియు నికిత రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :