నిహారిక “కమిటీ కుర్రోళ్లు” టీజర్‌ను రిలీజ్ చేసిన నితిన్

నిహారిక “కమిటీ కుర్రోళ్లు” టీజర్‌ను రిలీజ్ చేసిన నితిన్

Published on Jun 14, 2024 9:54 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల వర్ధమాన చిత్రనిర్మాతలకు మరియు ప్రతిభకు మద్దతుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ను స్థాపించారు. ఆమె వెబ్ సిరీస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఈ నిర్మాత కమిటీ కుర్రోళ్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకి తిరిగి వచ్చారు. ఈ సినిమా టీజర్ ను హీరో నితిన్ కొద్ది గంటల క్రితం విడుదల చేసారు. ఆకట్టుకునే విలేజ్ విజువల్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు నిర్మాణ విలువలతో ఆకట్టుకుంటుంది.

కొత్తవారితో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి యధు వాస్మి దర్శకత్వం వహించారు మరియు ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు మరియు ప్రసాద్ బెహరా నటించగా, అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌ పై కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు