“మాచర్ల నియోజకవర్గం” నుంచి ఊహించని లెవెల్ మాస్ చూపించిన నితిన్.!

Published on Mar 30, 2022 11:07 am IST

మన టాలీవుడ్ యంగ్ యంగ్ హీరో యూత్ స్టార్ నితిన్ బర్త్ డే ఈరోజు కాగా అభిమానులు సహా టాలీవుడ్ సినీ తారలు అతడికి బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అలాగే ఇదే సమయంలో నితిన్ అభిమానులు మాత్రం తాను నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం” నుంచి ఇచ్చే ఫస్ట్ ఎటాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నితిన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

మరి ఇప్పుడు దీన్ని రిలీజ్ చెయ్యగా ఇది మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. అసలు గతంలో నితిన్ ఏ సినిమాల్లో కూడా చూడని మాస్ ఫీస్ట్ తో ఈ టీజర్ కట్ కనిపిస్తుంది. ఇందులో కనిపించే ప్రతి విజువల్ కూడా మంచి సాలిడ్ గా ఫీస్ట్ ఇచ్చే విధంగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కట్ చేశారు. అంతే కాకుండా థియేటర్స్ లో ఈ పర్టిక్యులర్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి డెఫినెట్ ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

అలాగే ఈ వీడియోలో మహతి స్వర సాగర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఎఫెక్టివ్ గా ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే ఇది నితిన్ నుంచి అభిమానులకి ఒక అదిరే ట్రీట్ కాగా తన కెరీర్ లో సాలిడ్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉందని అనిపిస్తుంది. మరి జూలై 8న వచ్చే కంప్లీట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :