కంటిన్యూ అవుతున్న నితిన్ మాస్ సాంగ్ మాసివ్ హవా.!

Published on Jul 30, 2022 3:00 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “మాచర్ల నియోజకవర్గం” కోసం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొనగా ఇక ఇప్పుడు ఒకో అప్డేట్ తో మరిన్ని అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొంటున్నాయి.

అయితే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో సెట్ చేసి పెట్టిన పలు అంశాల్లో సంగీత దర్శకుడు మహతి సాగర్ అందించిన మాస్ ఐటెం నెంబర్ రా రా రెడ్డి సెన్సేషన్ ని రేపుతోంది. ఫారిన్ ఆడియెన్స్ లో కూడ మంచి రీచ్ ని అందుకున్న ఈ సాంగ్ లేటెస్ట్ గా అయితే 30 మిలియన్ వ్యూస్ మార్క్ క్రాస్ చేసి మరో మైల్ స్టోన్ తో హవా కొనసాగిస్తోంది. మొత్తానికి అయితే ఈ సాంగ్ సినిమాకి సాలిడ్ రీచ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఈ ఆగస్ట్ 12న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :