నితిన్ భార్యకి కూడా కరోనా..అయినా బ్యూటిఫుల్ గా తన ప్రేమను చూపించాడు!

Published on Jan 7, 2022 8:00 am IST

ఇప్పుడు మళ్ళీ మన దేశంలో ఊహించని రీతిలో కరోనా తీవ్రత పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జస్ట్ రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. మరి ఈ సమయంలోనే అనేక మంది సినీ తరాలకు కూడా కరోనా పాజిటివ్ వస్తుండడం మరింత కలవరపెడుతుంది.

అయితే ఇదిలా ఉండగా నిన్న రాత్రే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ వార్త షాక్ ఇవ్వగా తర్వాత మరో యంగ్ హీరో నితిన్ తన భార్య కూడా కోవిడ్ తో ఐసోలేషన్ లో ఉన్నట్టు రివీల్ చేసాడు. అయితే ఆమెకి వచ్చి ఆల్రెడీ కొన్ని రోజులు అయ్యినట్టే ఉన్నా ఈ గ్యాప్ లోనే ఆమె పుట్టినరోజు రావడం దానిని డైరెక్ట్ గా కలిసి వేడుకలా చేసుకోలేకపోవడం బాధాకరం.

అయినా కూడా ఎంతో అందంగా నితిన్ తన భార్యకి ఈ సమయంలోనే బర్త్ డే ని చేసి వీడియో ద్వారా తెలిపాడు. కరోనా కి హద్దులు ఉండొచ్చేమో కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని తన భార్య ఐసోలేషన్ రూమ్ లో ఉంటే తాను కింద నుంచి కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ బర్త్ డే ని చేసాడు. ఇదంతా చూడటానికి ఒకింత ఎమోషనల్ గా ఉన్నా నితిన్ కి తన లైఫ్ పార్ట్నర్ పట్ల ఎంత ఉందో అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :