హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిర్విరామంగా జరుగుతోంది. సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో ఈ మూవీని కంప్లీట్ చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో లయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తు్న్నాడు. కెవి.గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.