మరో భారీ సినిమాని రిలీజ్ చేయనున్న నితిన్.!

మరో భారీ సినిమాని రిలీజ్ చేయనున్న నితిన్.!

Published on Feb 1, 2023 11:01 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు స్టేట్స్ లో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. మరి అలా గత ఏడాది నితిన్ చేసిన “విక్రమ్” చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు.

మరి ఈ చిత్రం కన్నడ నుంచి భారీ అంచనాలు నడుమ వస్తున్న “కబ్జా” కాగా ఈ చిత్రంలో ఉపేంద్ర హీరోగా నటించగా కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రాన్ని అయితే తాను తమ బ్యానర్స్ రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇక ఈ భారీ చిత్రం ఈ మార్చ్ 17 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించగా రవి బసృర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు