క‌మిటీ కుర్రోళ్ళ‌కి బ్రేక్ ఇస్తున్న నితిన్

క‌మిటీ కుర్రోళ్ళ‌కి బ్రేక్ ఇస్తున్న నితిన్

Published on Jun 13, 2024 7:30 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్ళు’ ఇప్ప‌టికే మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. కొత్త ద‌ర్శ‌కుడు యాదు వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

ఈ సినిమా టీజ‌ర్ ను జూన్ 14న సాయంత్రం 5 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా ఈ టీజ‌ర్ రిలీజ్ కానుంది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్ తో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌మ సినిమాకు బూస్ట్ ఇవ్వ‌నున్న నితిన్ కు ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో సందీప్ స‌రోజ్, య‌శ్వంత్ పెండ్యాల‌, ఈశ్వ‌ర్ ర‌చిరాజు, త్రినాథ్ వ‌ర్మ, ప్ర‌సాద్ బెహ‌ర‌, మ‌ణికంఠ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు