‘లై’ టీజర్ విడుదలయ్యేది ఎప్పుడంటే..!
Published on Jul 8, 2017 5:35 pm IST


యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘లై’ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అ.. ఆ వంటి ఘనవిజయం తరువాత నితిన్ నటిస్తున్న చిత్రం ఇదే. కృష్ణ గాడి వీరప్రేమ గాధ దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఇతర పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్ర టీజర్ ని ఈ నెల 11 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. సీనియర్ హీరో అర్జున్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11 న ‘లై ‘ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook