నితిన్ “మాచర్ల నియోజకవర్గం” పై లేటెస్ట్ అప్డేట్

Published on Mar 23, 2022 10:02 pm IST

యంగ్ హీరో నితిన్ తదుపరి చిత్రం మాచర్ల నియోజకవర్గంలో హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కృతి శెట్టి మరియు కేథరిన్ త్రెసా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ రోజు, మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది. రేపు ఉదయం 10:08 గంటలకు తమ వద్ద ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఉందని ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటిస్తుందని హీరో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే దాని పై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :