నితిన్ “మాచర్ల నియోజకవర్గం” రిలీజ్ డేట్ ఫిక్స్

Published on May 8, 2022 9:00 pm IST

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం మాచర్ల నియోజకవర్గం. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, వీడియో లకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ప్రకటన చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని ఆగష్టు 12, 2022 న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ యంగ్ హీరో సమంతా నటిస్తున్న యశోద మరియు అఖిల్ నటిస్తున్న ఏజెంట్‌ తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కృతి శెట్టి మరియు కేథరిన్ ట్రెస్సా కథానాయికలు గా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :