సీరియస్ కథతో ఎంటర్ టైన్ చేయబోతున్న నితిన్ ?

Published on Mar 25, 2023 11:00 pm IST

‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. తాజాగా హీరో నితిన్ తో హీరోయిన్ రష్మికా మందన్నాతో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా కథ ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు ?, తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు?, చుట్టూ ఉన్న జనం అతని పై చూపించే సింపతీకి అతను ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణంలో వెంకీ కుడుముల ఈ పాయింట్ ను ఫన్నీ వే లో చూపించబోతున్నాడని తెలుస్తోంది.

మొత్తానికి సీరియస్ కథతో నితిన్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. అన్నిటికీ మించి భీష్మ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.. వెంకీ కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :