‘కాటమరాయుడు’ రైట్స్ ను సొంతం చేసుకున్న నితిన్ !
Published on Feb 11, 2017 3:17 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తునం తాజా చిత్రం ‘కాటమరాయుడు’ పై ఎన్ని భారీ అంచనాలున్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేసి కలెక్షన్లపరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. దీంతో పలు ఏరియాల్లో డిస్టిబ్యూషన్ హక్కుల్ని దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మెగా హీరోలకి మంచి పట్టున్న నైజాం ఏరియాలో ఈ పోటీ ఇంకా తారా స్థాయిలో ఉంటుంది.

అంతటి గట్టి పోటీని తట్టుకుని పవన్ వీరాభిమాని, యంగ్ హీరో నితిన్ ఆ హక్కుల్ని దక్కించుకున్నాడు. తన సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ పై ఆసియన్ ఫిలిమ్స్ తో కలిసి ఈ హక్కుల్ని తీసుకుని నైజాంలో చిత్రాన్ని డిస్టిబ్యూట్ చేయనున్నాడు నితిన్. నితిన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. ఇకపోతే డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేసే అవకాశముంది.

 
Like us on Facebook