నితిన్ కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది !
Published on Nov 25, 2017 11:55 am IST

శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న దిల్‌ రాజు తో శ్రీనివాస కళ్యాణం సినిమా చెయ్యబోతున్నారు. నితిన్ ఈ సినిమాలో హీరో, మిక్కి జే మేయర్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది మర్చి నుండి ఈ సినిమా మొదలుకానుంది. ఈ విషయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ముందుగా ఈ సినిమాను సీనియర్‌ హీరో నాగార్జునతో చేయాలని భావించాడు దిల్ రాజు కాని కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ప్రస్తుతం నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు, ఆ సినిమా తరువాత నితిన్ చెయ్యబోయే సినిమా ఇదే అవ్వడం విశేషం. త్వరలో ఈ సినిమాకు సంభందించి మరిన్ని వివరాలు తెలియబోతున్నాయి.

 
Like us on Facebook