లేటెస్ట్ : నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి మాస్ ఐటెం సాంగ్ రిలీజ్ అప్ డేట్… !!

Published on Jul 4, 2022 10:30 pm IST

యువ నటుడు నితిన్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ హంగులు కూడా కలగలిపి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు ఎమ్. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీలో యువనటి అంజలి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్, ఆ సాంగ్ లో అంజలి పిక్స్ ని రిలీజ్ చేసింది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ సాంగ్ కి మహతి స్వరసాగర్ అద్భుతమైన ట్యూన్ ని అందించినట్లు చెప్తోంది యూనిట్. ‘రా రెడ్డి ఐయామ్ రెడీ’ అనే పల్లవితో సాగె ఈసాంగ్ ని సింగర్ లిప్సిక సూపర్ గా పాడారని, అలానే ఈ సాంగ్ లిరికల్ వీడియోని జులై 9 న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగష్టు 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :