నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ …. !

Published on Aug 6, 2022 9:10 pm IST

నితిన్ తో యువ దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన భారీ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

నితిన్ ఈ మూవీలో ఐఏఎస్ అధికారి సిద్దార్ధ రెడ్డి పాత్ర చేస్తుండగా సముద్రఖని ఎమ్యెల్యే రాజప్ప అనే నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల నుండి ఎంతో భారీ లెవెల్లో నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మహతి స్వరసాగర్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ ఆగష్టు 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :