నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ ఫిక్స్….!

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ ఫిక్స్….!

Published on Jul 6, 2022 6:00 PM IST

నితిన్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి, క్యాథరీన్ థ్రేసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నితిన్ ఈ మూవీలో కలెక్టర్ సిద్ధార్థ రెడ్డి పాత్ర చేస్తున్నారు. అయితే ఈ మూవీలో యువనటి అంజలి ఒక సూపర్ మాస్ సాంగ్ చేస్తున్నట్టు ఇటీవల యూనిట్ ఆమె పోస్టర్ తో ప్రకటించింది. కొద్దిరోజులు క్రితం హైదరాబాద్ లో వేసిన ఒక ఇండోర్ సెట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరించింది యూనిట్.

‘రా రెడ్డి ఐయామ్ రెడీ’ అనే పల్లవితో సాగె ఈసాంగ్ ని సింగర్ లిప్సిక సూపర్ గా పాడారని, అలానే ఈ సాంగ్ లిరికల్ వీడియోని జులై 9 న రిలీజ్ చేస్తున్నట్లు తెల్పిన యూనిట్, శ్రీకాకుళంలో మాస్ మ్యూజిక్ జాతర పేరిట ఒక ఈవెంట్ ద్వారా సాంగ్ నీ రిలీజ్ చేస్తున్నామని నేడు అనౌన్స్ చేసింది. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుండి ఈవెంట్ ప్రారంభం అవుతుందని, అలానే ఈ సాంగ్ కి సంబంధించి ఒక సర్ప్రైజ్ కూడా ఉందని అంటోంది యూనిట్. మొత్తంగా ఒక్క సాంగ్ తో అందరిలో మంచి హైప్ క్రియేట్ చేసింది మాచర్ల నియోజకవర్గం యూనిట్. కాగా యువ దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి ఎంతో అధ్బుతంగా తీసిన ఈ మూవీని ఆగస్ట్ 12 న విడుదల చేయనున్నామని, తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు