ఫైనల్ గా ఒటిటిలో ఆరోజున వస్తున్న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

ఫైనల్ గా ఒటిటిలో ఆరోజున వస్తున్న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

Published on Nov 25, 2022 9:00 PM IST


నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కిన లేటెస్ట్ భారీ
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మాచర్ల నియోజకవర్గం. కోలీవుడ్ నటుడు సముద్రఖని నెగటివ్ రోల్ చేసిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది.

అనంతరం ఈ మూవీ ఒటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని పలువురు ప్రేక్షకాభిమానులు ఎప్పటినుండో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫైనల్ గా మాచర్ల నియోజకవర్గం మూవీని డిసెంబర్ 9 న ప్రముఖ ఒటిటి ప్లాట్ ఫామ్ జీ5 ఓటిటి లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి అటు థియేటర్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఈ మూవీ ఓటిటి లో ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు