నితిన్ “మాచర్ల నియోజకవర్గం”లోకి బాలీవుడ్ భామ..!

Published on Mar 8, 2022 3:00 am IST


యూత్ స్టార్ నితిన్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం చిత్ర బృందం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను రంగంలోకి దింపబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇదిలాఉంటే ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :