ఆకట్టుకుంటోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ రక్షాబంధన్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో

Published on Aug 10, 2022 11:59 pm IST

నితిన్ హీరోగా ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా మెగాఫోన్ పట్టిన మూవీ మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, క్యాథరీన్ త్రెసా హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై దీనిని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. నితిన్ ఈ మూవీలో సిద్దార్థ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తున్నారు. సాంగ్స్,ట్రైలర్ రిలీజ్ తరువాత అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఆగష్టు 12న విడుదల కానుంది.

ఇక నేడు రాఖీ పౌర్ణమి కావడంతో హీరో నితిన్, తన సోదరి మరియు ఈ మూవీ నిర్మాతైన నిఖితా రెడ్డి తో స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ షోలో పాల్గొన్నారు. మంగ్లీ సరదాగా వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన ఈ స్పెషల్ షో ప్రోమో నిన్న రాత్రి విడుదల చేయగా ప్రస్తుతం అది యూట్యూబ్ లో మంచి ఆదరణతో కొనసాగుతోంది. కాగా ఫుల్ వీడియోని నేడు విడుదల చేయనున్నారు.

వీడియో ఇంటర్వ్యూ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :