అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే మౌత్ టాక్ బాగుండడంతో ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి.
ఇక తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యువ హీరో నితిన్ చిత్ర బృందం ఫై ప్రశంసలు కురిపించారు. చిత్రం చాలా వాస్తవికంగా అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా ఉంది . నేను చాలా ఎంజాయ్ చేశానని చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి గారికి అలాగే హీరో కార్తికేయ మరియు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటు చిత్ర యూనిట్ అందరికి ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు.
#RX100 a realistic film with a v bold approach n with some great twists..thoroughly njoyed the film.. must congratulate @DirAjayBhupathi for coming up with such a film.. @ActorKartikeya n @starlingpayal hv done a grt job too..congratulations to the entire team???
— nithiin (@actor_nithiin) July 17, 2018