నితిన్‌తో సినిమా చేయనున్న హను రాఘవపూడి?

11th, August 2016 - 08:20:32 AM

nithin-and-hanu-ragavapudi
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, కొద్దిరోజుల క్రితం అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇద్దరూ ఖరారు చేస్తూ, తమ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అఖిల్ వేరొక నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందున్న హను రాఘవపూడి సినిమా ఇప్పట్లో చేయలేరని తెలిసింది.

ఈ నేపథ్యంలోనే హను రాఘవపూడి, నితిన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. 14 రీల్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్‌తో సినిమా చేయాలని హను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే విషయమై అధికారిక ప్రకటన ఒకటి ఇంకా రావాల్సి ఉంది. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, హనురాఘవపూడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.