‘లై’ రిలీజ్ డేట్ లాక్ చేసిన నితిన్
Published on Jun 13, 2017 2:10 pm IST


నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లై’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11 న విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. లై చిత్రంపై సినీవర్గాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్ర పోస్టర్ లు ఆసక్తిని కలిగిస్తుండగా నిన్న విడుదల చేసిన ‘బొంబాట్’ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో నితిన్ సరసన తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అ..ఆ వంటి ఘనవిజయం తరువాత తన చిత్రాల విషయంలో నితిన్ తగు జాగ్రతలు తీసుకుంటున్నాడు.

 
Like us on Facebook