మార్చి నుండి నితిన్ కొత్త సినిమా ప్రారంభం !

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటిస్తున్నాడు. ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. తాజాగా నితిన్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా మార్చి నుండి మొదలు కాబోతోంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందించబోతున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో నితిన్ తో జతకట్టనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు.