విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న హోమ్లీ బ్యూటీ..?

విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న హోమ్లీ బ్యూటీ..?

Published on Jul 3, 2024 12:37 PM IST

త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుపతి ఇటీవ‌ల లీడ్ రోల్ లో న‌టించిన ‘మ‌హారాజ’ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా చిత్ర యూనిట్ తెర‌కెక్కించ‌గా, ప్రేక్ష‌కులు ఈ సినిమాకు సెన్సేష‌నల్ రెస్పాన్స్ అందించారు. ఇక ఈ సినిమా త‌రువాత విజ‌య్ సేతుపతి ఇప్పుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

పాండిరాజ్ డైరెక్ష‌న్ లో విజ‌య్ సేతుప‌తి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హోమ్లీ బ్యూటీ నిత్యా మీన‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కంప్లీట్ ఎంట‌ర్టైన‌ర్ గా మేక‌ర్స్ తీర్చిదిద్ద‌నున్నారు.

దీంతో ఈ సినిమాలో నిత్యా మీన‌న్ పాత్ర ఎలా ఉండ‌బోతుందా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి తెలుగులోనా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు