రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నిత్యా మీనన్ “కుమారి శ్రీమతి”

Published on Sep 18, 2023 2:33 pm IST

బ్రీత్: ఇన్‌టు ది షాడోస్ (సీజన్ 2) మరియు తిరుచిత్రంబలం సినిమాలలో ఇటీవల ప్రేక్షకులను అలరించి, అత్యంత ప్రశంసలు పొందిన నటి నిత్యా మీనన్, కుమారి శ్రీమతి పేరుతో తన రెండవ తెలుగు సిరీస్‌లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కామెడీ డ్రామా సిరీస్‌ని శ్రీనివాస్ అవసరాల రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ మేకర్స్ ఇటీవల ఒక గ్లింప్స్ వీడియోతో ఆకట్టుకున్నారు. ఈ రోజు ఈ సిరీస్ సెప్టెంబర్ 28, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుందని అధికారికంగా ప్రకటించారు.

ఇది తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటుంది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. తారాగణంలో నిరుపమ్, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వరి, నరేష్ మరియు మురళీ మోహన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :