నైట్రో స్టార్ సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Published on Sep 6, 2023 11:02 pm IST

టాలీవుడ్ యువ నటుడు నైట్రో స్టార్ సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ మామ మశ్చీంద్ర. ఆయన మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్న ఈ మూవీని అమృతం సీరియల్ ఫేమ్ హర్షవర్ధన్ తెరకెక్కిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మృణాళిని రవి, ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, తమ మూవీని అక్టోబర్ 6న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. థ్రిల్లింగ్ యాక్షన్ మూవీగా రూపొందిన మామా మశ్చీంద్ర మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :