బ్రోచేవారెవరురా నుండి నివేదా లుక్ విడుదల !

Brochevarevarura1

మెంటల్ మదిలో తరువాత యంగ్ హీరో శ్రీ విష్ణు , వివేక్ ఆత్రేయ కాంభినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాలు డిఫ్రెంట్ గా ఉండి సినిమా ఫై అంచనాలను తీసుకొచ్చాయి.

ఇక తాజాగా ఈ చిత్రం నుండి హీరోయిన్ నివేదా థామస్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో నివేదా క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తున్నట్లు అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేత పేతురాజ్ మరో కథానాయికగా నటిస్తుంది.

వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలకానుంది.

Exit mobile version