ఆ కొరియన్ రీమేక్‌కి “శాకిని డాకిని” టైటిల్ ఖరారు..!

Published on Nov 2, 2021 11:04 pm IST


నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అయితే నేడు నివేదా థామస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ రీమేక్‌కి “శాకిని డాకిని” అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :