పవన్ సినిమాలో నటించడం లేదన్న హీరోయిన్ !

nivetha-thomas
పవన్ కళ్యాణ్ ప్రస్తుత చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా కాకుండా త్రివిక్రమ్ తో ఒక చిత్రం, తమిళ దర్శకుడు నీసన్ తో మరొక సినిమాకి సైన్ చేశాడు. ఈ చిత్రం తమిళ స్టార హీరో అజిత్ నటించిన ‘వేదాళం’ కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా కొత్తగా తెలుగు వారికి పరిచయమైన నటి నివేత థామస్ నటిస్తుందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తపై స్పందించిన నివేతా థామస్ తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిచడం లేదని తెలిపింది. ట్విట్టర్ లో పవన్ అభిమాని ఒకరు అడిగిన ఈ ప్రశ్నకు నివేతా సారీ చెబుతూ ఆ వార్త నిజం కాదని, తాను పవన్ సినిమా చేయడం లేదని తేల్చేసింది. దీంతో ఈ రూమర్లకు తెరపడినట్లయింది. ఇకపోతే నివేతా ప్రస్తుతం నాని సరసన ఒక సినిమాలో నటించనుంది.