కిలిమంజారోను అదిరోహించిన నివేదా థామస్..!

Published on Oct 23, 2021 6:43 pm IST


ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలంటే ఎంతో సాహసోపేతం చేయాలనే చెప్పాలి. అయితే సముద్ర మట్టానికి 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతాన్ని హీరోయిన్ నివేదా థామస్‌ విజయవంతంగా అధిరోహించింది. ఈ విషయాన్ని నివేదా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్‌ చేసింది.

అయితే చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ఆమె ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. తాజాగా ఆమె కిలిమంజారోను అదిరోహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో నివేదా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో రూపొందుతున్న ‘మీట్‌ క్యూట్‌’ సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More