వైరల్: “జై బాలయ్య” పాటకు పవన్ హీరోయిన్ స్టెప్పులు..!

Published on Dec 29, 2021 11:02 pm IST

పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేదా థామస్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా అఖండ సినిమాలోని “జై బాలయ్య పాటకు ఈ అమ్మడు స్పూఫ్ చేసింది. ఈ పాటలో బాలకృష్ణ షర్ట్ లు మార్చి వేసిన స్టెప్పును చేయాలని నివేదా ప్లాన్ చేసుకోగా అది కాస్త బెడిసి కొట్టింది.

అయితే మొదటి షర్ట్‌ మారేవరకూ బాగానే ఉంది, రెండో షర్ట్‌ మారేటప్పుడు సరిగా రాకపోవడంతో లాగుతూ లాగుతూ నివేదా తమ్ముడు నిఖిల్ ఫ్రేమ్ లోకి వచ్చేశాడు. అది చూసుకోకుండా స్టెప్ పూర్తి చేసి వెనక్కి తిరిగింది నివేదా. వెనకాలే షర్ట్ లను లాగుతూ తమ్ముడు కనిపించడంతో ఒక్కసారిగా నవ్వేసింది. ఈ వీడియోను షేర్ చేసిన నివేదా ఏది ఏమైనా అఖండ అనుభవం అదిరిపోయింది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :