’35’ టీజ‌ర్.. నిజంగానే ‘చిన్న క‌థ కాదు’గా!

’35’ టీజ‌ర్.. నిజంగానే ‘చిన్న క‌థ కాదు’గా!

Published on Jul 3, 2024 6:27 PM IST

మ‌ల‌యాళ బ్యూటీ నివేదా థామ‌స్ న‌టిస్తున్న తాజా చిత్రం ’35 – చిన్న క‌థ కాదు’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నంద కిషోర్ తెర‌కెక్కించ‌గా, రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్ తోనే అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ సినిమా, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో కూడా ఇంప్రెస్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

’35’ టీజ‌ర్ చాలా రిఫ్రెషింగ్ గా క‌నిపించింది. ఓ సాధార‌ణ స‌గటు గృహిణి పాత్ర‌లో నివేదా థామ‌స్ చ‌క్క‌గా ప‌ర్ఫార్మ్ చేసింది. త‌న కొడుకు చ‌దువులో వెన‌క‌బ‌డి ఉండ‌టం.. త‌న‌లాగా ఫెయిల్ కాకూడ‌ద‌ని.. క‌నీసం 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల‌ని టీచ‌ర్లు అన‌డంతో.. ఆ త‌ల్లి ఏం చేసింద‌నే కథ‌తో ఈ సినిమా వ‌స్తున్న‌ట్లుగా ఈ టీజ‌ర్ క‌ట్ లో చూపెట్టారు. నివేదా థామ‌స్ ప‌ర్ఫార్మెన్స్ కు ప్రేక్ష‌కులు మ‌రోసారి ఫిదా కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక ఈ టీజర్ లో వివేక్ సాగ‌ర్ అందించిన బీజీఎం సూప‌ర్ గా ఉంది. ఈ సినిమాలో విశ్వ‌, ప్రియ‌ద‌ర్శి, గౌత‌మి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 15న తెలుగుతో పాటు త‌మిళ‌, మల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు