“రొమాంటిక్” నైజాం ఏరియా కలెక్షన్స్ ఇవే!

Published on Nov 2, 2021 12:21 am IST


ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం ఆకాష్ కి డు ఆర్ డై అని చెప్పాలి. గత శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం మంచి మౌత్ టాక్ తో దూసుకు పోతుంది అని చెప్పాలి. థియేటర్ల లో సైతం మంచి ఆక్యుపెన్సీ ను సొంతం చేసుకుంటుంది.

నైజాం లో ఈ చిత్రం కి మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి మూడు రోజుల్లో దాదాపు 70 లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు రోజులు ఎలా ఉన్నా, వీక్ డేస్ మొదలు కావడం తో అసలు పరీక్ష మొదలు కానుంది. కొన్ని ప్రాంతాల్లో బీ మరియు సి సెంటర్ లలో మధ్యాహ్నం కూడా మంచి ఆక్యు పెన్సి ను కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అనీల్ పాదురీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు ఛార్మి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :