ప్రీ రిలీజ్ బిజినెస్లో దూసుకుపోతున్న నందమూరి హీరో !

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న చిత్రం కూడా ఉంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి. శ్రీరామ్ పని చేస్తుండటం విశేషం.

ఇప్పటికే ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ రూ. 4.5 కోట్లకు కొనుగోలుచేయగా ఇప్పుడు హిందీ హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ రూ.2.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంకా పేరు కూడా పెట్టకముందే సినిమా రీ రిలీజ్ బిజినెస్ ఈ స్థాయిలో జరగడం విశేషమనే చెప్పాలి. తమిళ దర్శకుడు జయేంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.