థలపతి విజయ్ “బీస్ట్” కి ఈవెంట్ లేదా..?

Published on Mar 17, 2022 9:00 pm IST

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రీజనల్ గా భారీ వసూళ్లు రాబట్టగలిగే కొద్ది స్టార్స్ లో ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు. అయితే విజయ్ హీరోగా ఇప్పుడు నటించిన చిత్రం “బీస్ట్”. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అరబిక్ కూతు అయితే వీరు చెప్పిన దానికంటే పెద్ద హిట్ అయ్యింది.

ఇలా భారీ అంచనాలు నెలకొల్పుకుంటూ వెళ్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది వరకు విజయ్ ప్రతి సినిమాకి జరిగిన ఆడియో లాంచ్ భారీ ఈవెంట్ ని ఈ సినిమాకి మాత్రం ఎందుకో స్కిప్ చేస్తారని తెలుస్తుంది. ఇది వరకే అక్కడి మరో స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా ఎప్పుడో తన సినిమా వేడుకల్ని ఆపేసారు. మరి విజయ్ కూడా అలాంటి డెసిషన్ నే తీసుకున్నారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :