“RRR” వెనకడుగు లేదు.. ప్రీమియర్స్ కి సర్వం సిద్ధం..!

“RRR” వెనకడుగు లేదు.. ప్రీమియర్స్ కి సర్వం సిద్ధం..!

Published on Dec 30, 2021 7:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఎట్టకేలకు వెండితెరపై రిలీజ్ సిద్ధం అయ్యింది. జస్ట్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ సినిమాకి ఈ గ్యాప్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను మేకర్స్ జరుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ పట్ల అయితే ఇప్పుడు మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ వీటి అన్నిటికీ అతీతంగా మేకర్స్ మాత్రం ఫుల్ క్లారిటీ లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని ఈసారి అనుకున్న సమయానికి విడుదల చేసి తీరాలని ఫిక్స్ అయ్యిపోయారు. అందులో భాగంగానే ఆల్రెడీ పెద్ద ఎత్తున జనవరి 6వ తేదీన రాత్రి ప్రీమియర్ షో లకి రంగం అటు ఓవర్సీస్ సహా ఇక్కడ మన దగ్గర కూడా రెడీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో RRR సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగే సమస్యే లేదు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు