అక్కడ “భీమ్లా నాయక్” రిలీజ్ ఊసేది..?

Published on Feb 23, 2022 3:00 pm IST


ఈ ఏడాదికి మన టాలీవుడ్ నుంచి వస్తున్న మొట్ట మొదటి బిగ్గెస్ట్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన చిత్రం “భీమ్లా నాయక్” అని చెప్పాలి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని విడుదలకి సిద్ధం అవుతుంది.

అయితే మేకర్స్ ఈ సినిమాని తెలుగుతో పాటుగా హిందీలో కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా హిందీ రిలీజ్ విషయంలో మాత్రం అంత పర్టిక్యులర్ గా ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి. నామ మాత్రంగా ఒకటి రెండు పోస్టర్స్ తప్పితే హిందీ రిలీజ్ పై పెద్దగా ఊసే లేదు, ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేవు. అలాగే ట్రైలర్ కూడా ఇంకా రావాల్సి ఉంది. మరి ఫైనల్ గా హిందీలో భీమ్లా నాయక్ కి ఎలాంటి ఓపెనింగ్స్ దక్కుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :