రాధే శ్యామ్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు!

Published on Sep 29, 2021 5:25 pm IST

ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం కి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ చిత్రం కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం చిత్ర యూనిట్ త్వరలో షురూ చేయనుంది. అంతేకాక ఈ చిత్రం కి సంబంధించిన పాటలు త్వరలో ఒక్కొకటి గా విడుదల కానున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించి విడుదల తేదీ పై ఎలాంటి మార్పు లేదు. యూ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ పతాకం పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద లు నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటిర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14 కి సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :