మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ హీరోయిన్ విషయంలో నో చేంజ్.!

Published on Jun 17, 2022 7:04 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన భారీ హిట్ “సర్కారు వారి పాట” చిత్రం సక్సెస్ తర్వాత ఫ్యామిలీ తో కలిసి ఓ వెకేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్న సినిమా చేయనున్నారు.

మరి జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోనున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ క్లారిటీ అయితే వినిపిస్తుంది. గత కొన్ని రోజులు కితం ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అది నిజం కాదని తెలుస్తుంది. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ అని అందులో ఎలాంటి చేంజ్ లేదని కన్ఫర్మ్ అయ్యింది. తాను కూడా నెక్స్ట్ షూటింగ్ లో పాల్గొంటుంది అని తెలుస్తుంది. సో ఆ రూమర్ లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :