వెనక్కి తగ్గేది లేదంటున్న మహేష్, కొరటాల !

మహేష్ బాబు , కొరటాల శివ సినిమా షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 13 ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కారైకుడి (తమిళనాడు) బయలుదేరనుంది. 26 వరుకు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. మహేష్ ముఖ్యమంత్రి పాత్ర‌లో నటిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ హీరొయిన్ గా నటిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించినట్లు ఈ సినిమా ఏప్రిల్ 27 నాడే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య ‘2.0’ ఏప్రిల్ లో విడుదల కానుందని, దాని వలన మహేష్ సినిమా వాయిదా పడవచ్చని వార్తలొచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టు ముందుగా ప్రకటించిన తేదీకే కట్టుబడ్డారు. ఈ సినిమా కోసం కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ సిద్దం చేసుకొని సినిమా తీసున్నాడని సమాచారం. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకొనే కొరటాల ఈ సినిమాలో విద్యా వ్యవస్థ మరియు పేదరికం గురించి చర్చించబోతునట్లు తెలుస్తోంది.