‘నా పేరు సూర్య’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు !

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ కూడా ఒకటి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు నిర్మాతలు. కానీ నిన్న ఏప్రిల్ 27న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఉండటం వలన పోటీలో ఓపెనింగ్స్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో తేదీని ఏప్రిల్ 13కి మార్చినట్టు బలమైన వార్తలు వినబడ్డాయి.

కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని, ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రం ఏప్రిల్ 27నాడే విడుదలవుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరి 27న రెండు పెద్ద సినిమాల పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించగా విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందించారు.