అనుష్కకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి !

మొన్నటివరకు జనవరి 26వ తేదీన మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా నిన్న, ఈరోజుల్లో అవి కాస్త ఒకటికి పడిపోయాయి. అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలు 26వ తేదీని విడుదల తేదీగా ప్రకటించుకున్నాయి. దీంతో మూడు సినిమాలకు గట్టి పోటీ ఉంటుందని, కలెక్షన్ల పరంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుందని అందరూ భావించారు.

కానీ నిన్న సందీప్ కిషన్ యొక్క ‘మనసుకు నచ్చింది’ చిత్రం ఫిబ్రవరి 16 కు వాయిదాపడగా ఈరోజు విష్ణు, నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ సాంకేతిక కారణాల నిమిత్తం ఫిబ్రవరి 2వ వారానికి వెళ్ళింది. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఇప్పటికే తప్పుకున్నాయి. ఈ వాయిదాలతో అనుష్క ‘భాగమతి’కి సోలో రిలీజ్ దక్కింది. దీంతో మంచి ఓపెనింగ్స్ తో పాటు చిత్రం బాగుంటే పూర్తి వారం రోజుల పాటు పెద్ద పోటీ లేకుండా మెరుగైన రన్ ను అందుకునే అవకాశం కూడా దక్కింది.