“సర్కారు” నుంచి మరో మాస్ ట్రీట్ పై నో డౌట్!

Published on Sep 5, 2021 7:06 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ భారీ రెస్పాన్స్ ను కూడా కొల్లగొట్టాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మరో సాలిడ్ మాస్ ట్రీట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం. మొదట నుంచీ థమన్ ఇస్తున్న ఆల్బమ్ పై చాలా అంచనాలు ఉన్నాయి. పైగా మహేష్ మరియు థమన్ ల కాంబో ఆల్ టైం హిట్.. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సాంగ్ ఒక రేంజ్ లో ఉండనుంది తెలుస్తుంది.

వీరి కాంబోపై ఎన్ని అంచనాలు అయితే ఉన్నాయో వాటికి మించే థమన్ అదిరే మాస్ ఇంట్రో ట్యూన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మేకర్స్ బహుశా త్వరలోనే ఈ సాంగ్ పై కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని నయా టాక్. మొత్తానికి మాత్రం సర్కారు వారి పాట నుంచి మరో మాస్ ట్రీట్ రెడీ అవుతుంది సిద్ధంగా ఉండండి.

సంబంధిత సమాచారం :